15-03-2025 12:00:00 AM
బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చిన లేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పరిగణలోకి తీసుకుంటామని టీటీడీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
అయితే తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ నేటికీ పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంలో టీటీడీ తీరు మార్చుకోకుంటే తామంతా తిరుమలకే వచ్చి అక్కడే తేల్చుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేల లేఖలను పరిగణనలోకి తీసుకున్న టీటీడీ..
ఇప్పు డు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేల లేఖలను అంగీకరించకపోవడంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ వివక్షపూరిత వైఖరిపై టీటీడీ పునరాలోచించుకోవాలన్నారు. శ్రీవారి దర్శనానికి తమ లేఖలను అంగీకరించాలని తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఉమ్మడిగా డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంపై బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు.