09-03-2025 06:56:53 PM
మాలి మహా సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ఉమేష్ రావు డోలే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే దంపతుల ఆశయ సాధనకై మాలి మహా సంఘం కృషి చేస్తుందని అఖిల భారతీయ మహా సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ రావు డోలే అన్నారు.
ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ మాలి మహా సంఘం భవనంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శంకర్ నాగోషే, జిల్లా అధ్యక్షుడు మేంగాజి గురునులే, సీనియర్ నాయకుడు దత్తు కావుడే, మండల అధ్యక్షులడు ఆదే బాబురావు, జిల్లా బీసీ రైతు సంఘం సంఘం అధ్యక్షులు వైరాగడే మారుతి లతో కలిసి మాట్లాడుతూ... మాలి మహా సంఘం ఫూలే ఆశయ సాధన, మాలిల సామాజిక న్యాయం అనే అంశాలపై కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాలి మహ సంగ శాఖలు ఉన్నాయని మాలీల సామాజిక న్యాయం ఎస్టి హోదా విషయంలో త్వరలోనే జిల్లా నాయకులతో కలిసి కేంద్రాన్ని ఒప్పించి ఎస్టి హోదా బిల్లును ఆమోదించేలా కృషి చేస్తామని అన్నారు.
రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలి కులస్తులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మాలీలకు టికెట్లు కేటాయించి రాజకీయ ఎదుగుదలకు తోడ్పడాలని అన్నారు. పదవ తేదీ సోమవారం సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలి గ్రామాల్లో ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.