calender_icon.png 19 April, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా కదం తొక్కుదాం

17-04-2025 01:52:36 AM

యాదాద్రి భువనగిరి జిల్లా దిశ సమావేశంలో ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి 

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 16 ( విజయ క్రాంతి ): అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

బుధవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దిశ సమావేశానికి ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఎంపీ వివిధ శాఖల అభివృద్ధి పనుల సంబంధిం చిన పలు అంశాలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ప్రజల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు మరింతగా కృషి చేయాల న్నారు. నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

కేంద్ర పథకాలపై  ప్రజలకు అవగాహన కలిగించేలా సంబంధిత అధికారులు లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని ఎంపీ కోరారు. జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, సంబంధిత శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.