న్యూఢిల్లీ, నవంబర్ 6: అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంపట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హృదయపూర్వక అభినందనలు మిత్రమా అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ‘చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ గత పదవీకాలంలో సాధించిన విజయాలకు తగ్గ ట్టుగా.. ఈసారి కూడా అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగ స్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేద్దాం. అందుకు మా సహకారాన్ని పునరుద్ధరించడానికి ఎదురుచూస్తున్నా. ఇద్దరం కలిసి ఇరు దేశాల ప్రజల అభివృద్ధికి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు ను పెపొందించడానికి కృషి చేద్దాం’ అని పేర్కొన్నారు.
అంతేకాకుండా గతంలో పలు సందర్భాల్లో ట్రంప్ తో కలిసి దిగిన ఫొటోలను ప్రధాని షేర్ చేశారు. ట్రంప్ గత పాలనలో భారత్‌తో మెరుగైన సంబంధాలు నెలకొల్పారు. చైనా, పాకిస్థాన్‌లతో విభేదాలు వచ్చినప్పుడు ట్రంప్ ఇండియాకు సపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీ, ట్రంప్ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. గత ఎన్నికల సమయం లో ట్రంప్‌నకు మద్దతుగా ‘హౌడీ, మోడీ!, ‘నమస్తే ట్రంప్’ వంటి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు.