calender_icon.png 3 March, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలి

03-03-2025 12:07:36 AM

మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

మహబూబాబాద్, మార్చి 2 (విజయక్రాంతి) : ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం కల్వల గ్రామ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఐకమత్యమే మహాబలం అన్నారు.అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.

అధ్యక్షుడిగా మాందాటి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గంట రామ్మోహన్ రెడ్డి, ఉపా ధ్యక్షులుగా మెండు జగన్ రెడ్డి, సహాయ కార్య దర్శిలుగా గుర్రం నరేందర్ రెడ్డి, కొప్పుల మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా మెండు శ్రీనివాస్ రెడ్డి, వంటల అనిల్ రెడ్డి,గంట మహేందర్ రెడ్డి లను ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు గంట బాలకృష్ణారెడ్డి,కొమ్మాల యాకుబ్ రెడ్డి, ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి, గంట అశోక్ రెడ్డి, పెరటి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.