05-04-2025 12:35:27 AM
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్
హన్వాడ ఏప్రిల్ 4 : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వేపూర్, గుండ్యాల, కిష్టం పల్లి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు పూర్తిగా నిరుపేదలకు దూరమయ్యే ప్రమాదాలు ఉందని, రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందాలంటే బిజెపి కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టంకార కృష్ణయ్య, మండల కోఆర్డినేటర్ వెంకటయ్య, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నవనీత, వి.యాదవ రెడ్డి, చెన్నయ్య, గుండ్యాల గ్రామ అధ్యక్షుడు రామకృష్ణ, మండల నాయకుడు బొట్టు శీను కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.