calender_icon.png 15 November, 2024 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన చేపడుతాం

11-11-2024 12:23:38 AM

మహారాష్ట్రలో రైతులకు రూ.3 లక్షల రుణమాఫీ 

మహిళలకు నెలకు రూ.3 వేలు, ఉచిత బస్సు

మహావికాస్ అఘాడీ మ్యానిఫెస్టోలో ప్రకటన

మహాలక్ష్మి పథకం కింద మహారాష్ట్రలోని మహిళలకు ప్రతినెలా రూ.3 వేల ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం

రాజస్థాన్‌లో అమలవుతున్న రూ.25 లక్షల ఆరోగ్య బీమా   మహారాష్ట్రలోనూ అమలు

రూ.3 లక్షల వ్యవసాయ రుణమాఫీ

రుణాలను తిరిగి చెల్లించే రైతులకు రూ.50 వేల సాయం

డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు రూ.4 వేల భృతి

ముంబై, నవంబర్ 10: మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం రాగానే కులగణన నిర్వహిస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికా ర్జున ఖర్గే ప్రకటించారు. రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు 5 హామీలతో మహావి కాస్ అఘాడీ మ్యానిఫెస్టోను మల్లికార్జున ఖర్గే ఆదివారం విడుదల చేశారు. ప్రధానంగా కులగణన, రిజర్వేషన్లు, వ్యవసాయం, పట్టణ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యంపై కూటమి నేతలు దృష్టి సారించారు.

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కులగణన చేపట్టి, అందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న 50 శాతం రిజర్వేషన్లను మరింత పెంచుతామని స్పష్టం చేశారు. దీనిపై కూటమి నేతలతో చర్చలు జరుగుతు న్నాయని వివరించారు. దీనివల్ల వివిధ వర్గాలవారు మరింత ప్రయోజనం పొందేందుకు అవకాశముంది. 

తాము ప్రవేశపెట్టే పథకాల ద్వారా సామాన్య కుటుంబానికి ఏడాదికి సుమారు రూ. 3.5 లక్షల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్సీపీ (ఎస్సీపీ) నేత సుప్రియా సూలే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానాపటోలే, శివసేన (యూబీటీ) నాయకులు సంజయ్ రౌత్ పాల్గొన్నారు.