21-02-2025 12:00:00 AM
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిలుపు
నిర్మల్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) ః ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి నాయకుడు కార్యకర్త సమిష్టిగా పని చేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సుశీల్ బన్సల్ రాష్ర్ట నాయకులు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ పట్టభద్రుల వివరాలు నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల అంజిరెడ్డి ఉపాధ్యాయుని గురించి పోటీ చేస్తున్న కొమరయ్యను గెలుపు కోసం ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు.
నరేంద్ర మోడీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించాలని రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలపై నిరుద్యోగుల్లో చర్చ పెట్టాలని వారు పిలుపునిచ్చారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఓటర్లను అభ్యర్థించి విజయం సాధించినప్పుడే మనకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ జి నాగేష్ ఎమ్మెల్యేలు రామారావు పటేల్ పాల్వాయి హరీష్ బాబు పార్టీ అధ్యక్షులు రితేష్ రాథోడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.