calender_icon.png 20 January, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దాం

20-01-2025 05:04:49 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసేందుకు సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి పల్లెలో నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు అంజి కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అమలవుతున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి పార్టీ నిర్మాణం మరింత ప్రతిష్ట పరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఇంచార్జ్ ఐఎన్ఆర్ భూమయ్య, బిజెపి నాయకులు రాహుల్, రామనాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, రాచకొండ సాగర్, అలివేలు, సాధన, అరవింద్ తదితరులున్నారు.