12-03-2025 12:20:01 AM
పీసీసీ అధికార ప్రతినిధి, శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ డా. సత్యం శ్రీరంగం
కూకట్‌పల్లి మార్చి 11 (విజయక్రాంతి): మహిళలపై హింసను నిలువరిద్దాం వారి ఎదుగుదలను ప్రోత్సహించి హక్కులను కాపాడుతూ.. రక్షణగా నిలబడదామని టిపిసిసి అధికార ప్రతినిధి శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సత్యం శ్రీరంగం అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా ఖైత్లాపూర్ లోని చీర్స్ ఫౌండేషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ డా. సత్యం శ్రీరంగం, కో చైర్ పర్సన్ ఇందుమతి శ్రీరంగం పాల్గోని కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పిల్లలకి అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం లో మేడ్చెల్ జిల్లా ఉపాధక్షురాళ్లు జ్యోతి, ఏ, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాళ్లు రామగాళ్ల రమాదేవి, సంధ్య, డివిజన్ ల అధ్యక్షురాళ్లు మారుతీ, పొన్నం రజిత, జోజమ్మ, భారతమ్మ, విజయలక్ష్మి, యమున రాధ, గుండా జ్యోతి, . బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్, ఏఎంసి డైరెక్టర్స్ అరుణ్ గౌడ్, నరేష్, పవన్, మహిళా సీనియర్ నాయకురాళ్లు బండి సుధ, కైలా, కల్పన, నాగ శిరీష, రామేశ్వరి పాల్గొన్నారు.