ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ‘ఆన్‌లైన్ టీచింగ్’ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. కాబట్టి మీకు ఏదైనా ఒక సబ్జెక్టుపై బాగా నైపుణ్యం సాధిస్తే విద్యార్థులకు పాఠాలు బోధించవచ్చు. జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల కొంత అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. మీకు బోధన పట్ల ఇష్టం ఉంటే ’ఆన్‌లైన్ టీచింగ్’ను ఎంచుకోవడం చాలా ఉత్తమం. దీని వల్ల జ్ఞానం పెంచుకోవడమే కాకుండా, ఆత్మ సంతృప్తిని సొంతం చేసుకోవచ్చు.
ఫ్రీలాన్స్ రైటింగ్/ఎడిటింగ్: డిజిటల్ యుగంలో రోజురోజుకు బ్లాగులు, అనేక వెబ్‌సైట్స్ పుట్టుకొస్తున్నాయి. దాంతో కథలు రాయడం, వార్తలను ఎడిటింగ్ చేయడం, తప్పు ఒప్పులను సరిదిద్దడం లాంటివి అనివార్యంగా మారాయి. వీటిలో ఏ ఒక్కదానిపై పట్టున్నా.. ఇంటిపట్టునే ఉంటూ ఎంతోకొంత సంపాదించుకోవచ్చు. కాకపోతే కావాల్సిందల్లా కొంచెం టెక్నాలజీ తెలిసి ఉండటమే.
వర్చువల్ అసిస్టెంట్: చాలా కంపెనీలు రిమోట్ ప్రాతిపదికన కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ, ఇతర టాస్క్‌లను అందిస్తున్నాయి. వీటిపై మంచి పట్టుంటే కంపెనీలు స్వయంగా ఆవకాశాలు కల్పిస్తున్నాయి. ఏదైనా రంగంలో టెలీకాలర్‌గా పనిచేస్తూ మంచిగా సంపాదించుకోవచ్చు.
ఆన్‌లైన్ సేలింగ్/ఎంట్రప్రెన్యూర్: చాలామందికి సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటుంది. కానీ ఎలా చేయాలో తెలియదు. అలాంటివాళ్ల కోసం కొన్ని కంపెనీలు ‘ఆన్‌లైన్ సేలింగ్’ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా తయారుచేసిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్ముకొని బాగా సంపాదించుకోవచ్చు. అదేవిధంగా వ్యాపార మెలకువలు బాగా తెలిసిఉంటే ఎంట్రప్రెన్యూర్‌గానూ రాణించవచ్చు.
ఆతిథ్యం: రెస్టారెంట్లు, హోటళ్లలో ఆతిథ్యం అందించేందుకు అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వినియోగదారులను మర్యాదగా పలకరించడం, ప్రేమగా పిలవడం, ఇతరులను సులభంగా కమ్యూనికేట్ చేయడంలో మంచి స్కిల్స్ ఉంటే ఇలాంటి తరహా ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది ఈ రంగంలో రాణిస్తున్నారు కూడా.
డ్రైవింగ్: ఓలా, ఉబర్ లాంటి సంస్థలు డ్రైవింగ్ చేసేవారికి మంచి అవకాశాలు ఇస్తున్నాయి. మీకు డ్రైవింగ్ రంగంలో మంచి పట్టుంటే పార్ట్ టైంగా పనిచేస్తూ హాయిగా సంపాదించుకోవచ్చు. డ్రైవింగ్ చేయడం వల్ల కొత్త ప్రదేశాలను చూడటంతోపాటు కొత్త వ్యక్తల పరిచయం కూడా ఏర్పడుతుంది.
వాలంటీర్ వర్క్: వాలంటీరింగ్ అనేది ఎటువంటి ఆర్థిక లాభం లేకుండా ఒక వ్యక్తి లేదా సంస్థకు సేవ చేయడం లాంటిది. అయితే ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వాలంటీర్ వర్క్ చేయడానికి మనుషుల కొరత ఉంది. దీంతో కొన్ని సంస్థలు నామమాత్రపు ఆదాయం కల్పిస్తూ వాలంటీర్ వర్క్ చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఒకవేళ వాలంటీర్ వర్క్ ఇష్టమైతే.. ఈ రంగంలోనూ సెటిల్ అయ్యిపోవచ్చు.
ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాల జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. జీవితంలో స్థిరపడాలనే కోరికతోనో, ఉన్నత చదువులు చదువాలనే ఉద్దేశంతోనో కానీ... ఈకాలం పిల్లలు కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి
దూర ప్రాంతాలకు పయనమవుతున్నారు. దాంతో చాలామంది ఒంటరిగా బతుకుపోరాటం చేస్తున్నారు. అలాగే రిటైర్‌మెంట్ తర్వాత ఆదాయ మార్గాల గురించి తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో చిన్న చిన్న నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. అరవైలో కూడా ఆర్థికంగా బలపడొచ్చు.