23-02-2025 12:00:00 AM
కోపం, చికాకు, సంతోషం, ఆందోళన మొదలైన భావోద్వేగాలు శరీరం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వాటి ప్రభావాల పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా నవ్వడం వల్ల రోగనిరోధకశక్తికి తోడ్పడే కణాలు బాగుంటాయి. రక్తనాళాల పనితీరు కూడా మెరుగై రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే తరచుగా కోపం ప్రదర్శించే వ్యక్తులు కచ్చితంగా సంయమనం పాటించాలి.
అలాగే కోపడేవారిలో ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం గుండె మీద పడుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే యాంటీబాడీల పరిమాణం తగ్గి వ్యాధినిరోధక వ్యవస్థ కుంటుపడుతుంది. కాబట్టి కోపాన్ని అవసరం మేరకు వ్యక్తపరచాలి. దీంతోపాటు నిస్సహాయత, నిరాశ లాంటి భావోద్వేగాలు శరీరంలో హార్మోన్ల అసమతౌల్యానికి కారణమవుతాయి. కాబట్టి అలాంటి భావోద్వేగాలకు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.