13-04-2025 12:30:18 AM
* నిద్రలేవగానే ఒక గ్లాసు నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరాన్ని రీఫ్రెష్ చేసి, హైడ్రేట్‌గా ఉంచుతుంది. గోరు వెచ్చని నీరైతే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
* ఉదయం నిద్ర లేచిన తర్వాత కొంత సమయం యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. రోజంతా ఉల్లాసంగా ఉండటానికి యోగా, వ్యాయామం సాయం చేస్తాయి.
* ఉదయం పూట పనులు చేసుకుంటూ ప్రశాంతమైన సంగీతం వినడం లేదా ఏదైనా మంత్రాన్ని జపిస్తూ ఉంటే మనసుకు ఆహ్లాదంగా ఉండటంతో పాటు మనలో సానుకూల దృక్పథం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
* పచ్చని చెట్లను చూసినప్పుడు మనకు ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే ఉదయం నిద్రలేచిన తర్వాత సమీపంలో పార్కు ఉంటే అక్కడికి వెళ్లి వాకింగ్ చేయాలి. ఒకవేళ ఇంటిలోనే గార్డెన్ లేదా బాల్కనీలో పచ్చని మొక్కలు ఉంటే వాటిమధ్య కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఇది తెలియని హాయిని కలిగిస్తుంది.