calender_icon.png 27 November, 2024 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమ స్ఫూర్తితో ప్రజల పక్షాన నిలబడదాం

27-11-2024 05:51:17 PM

మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఉద్యమస్ఫూర్తితో ప్రజల పక్షాన నిలబడదామని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు టిఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. బుధవారం ఎమ్మెల్యే కోవలక్ష్మి అధ్యక్షతన తన నివాసంలో ఈనెల 29న నిర్వహించే దీక్ష దివాస్ సన్నాహక సమావేశానికి జిల్లాలోని ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో మలిదశ ఉద్యమంలో కేసీఆర్ ఎంతో కీలకంగా పాల్గొని ఉద్యమాలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉద్యమ స్ఫూర్తి రాకపోవడంతో 2009లో కెసిఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తిన రగిలించి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపి ప్రతి గొంతుక తెలంగాణ నినాదంతో పోరాటం చేసేలా చేయడం జరిగిందన్నారు.

సాధించిన తెలంగాణలో పది సంవత్సరాలు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కెసిఆర్ ముందుకు వెళ్లారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త ముందుండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ప్రజలే బహిరంగంగా చర్చించుకుంటున్న సందర్భం వచ్చిందన్నారు. అదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ.. డోకా బాజీ హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి ఇచ్చిన హామీలలో ఉచిత బస్సు సౌకర్యం ఏది కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. డొకా బాజీ కాంగ్రెస్ కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సింగల్ విండో చైర్మన్లు అలీబిన్ అహ్మద్, సంజీవ్, మాజీ జడ్పిటిసిలు అజయ్ కుమార్ దూర్పదాబాయి, మాజీ ఎంపీపీ సౌందర్య, నాయకులు అన్సార్, రవి, సాజిద్, రవీందర్, యూనుస్, కలాం, హకీమ్ తదితరులున్నారు.