ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, జనవరి 2 (విజయ క్రాంతి) : పాలమూరు విద్యానిధి చేస్తున్న సేవలను ప్రపంచానికి చాటి చెప్పేలా తీర్చిది ద్దుకుందామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహ బూబ్ నగర్ విద్యానిధి నిరుపేద విద్యార్థికి ఒక వరంగా మారాలన్నారు.
విద్యార్థులకు విద్యాపరమైన ఎటువంటి సమస్యలు ఎదు రైనా వెంటనే స్పందించే విధంగా మహబూ బ్ నగర్ విద్య నిధిని రూపకల్పన చేయడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణంలో పలు కళాశాలల్లో నూతన కోర్సులను అందుబా టులోకి తీసుకురావడం జరిగిందని, విద్య నిధిని ఒక కమిటీ ఆధ్వర్యంలో ఉంటుందని తెలిపారు. గత పాలకుల పొరపాట్ల వల్ల మనం విద్యా, ఉపాధి అవకాశాల్లో చాలా వెనక బడి ఉన్నామని వివరించారు.
గత కాంగ్రెస్ హయాంలో పాలమూరు బిడ్డలు విదేశాల్లో ఉన్నత స్థాయిలో పని ఉద్యోగాలు చేస్తున్నారని, నియోజకవర్గం ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల ఏర్పా టు, పదవ తరగతి ఉన్న స్కూల్లో 5మంత్రా స్ పుస్తకాలను అందించడం జరిగిందని తెలిపారు. నా వంతు బాధ్యతగా విద్యానిధికి రూ 50 లక్షలు అందిస్తున్నానని, వ్యాపార వేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు తదితర ప్రజా సేవ నాయక వర్గమే కాక ప్రజలు విధ్యా నిధిలో తమ వంతు పాలు పాలుపంచు కోవాలని కోరారు.
మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమౌతుందని, ప్రతి సంవత్సరం విధ్యానిధికింద 2కోట్ల రూపాయలు అందించాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా విద్యా నది కొనసాగేలా జిల్లా కలెక్టర్ కూడా కమిటీలో అనుసంధానమై ఉన్నారని తెలిపారు. వసతి గృహాలను సందర్శించి అక్కడ సమస్యలను పరిష్కరించ దుగాను రూ. 1 కోటి ఖర్చు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రతి ఆదివారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో శ్రమదానా కార్యక్రమాన్ని పక్కన అమలు చేస్తామని తెలియజేశారు. నియోజ కవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా మని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంధాలయ చైర్మన్ మల్లు నరసింహ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయ కులు వినోద్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్, శిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు.