calender_icon.png 19 January, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రచందనం దొంగల సంగతి తేలుస్తాం

12-07-2024 01:53:53 AM

ఎర్రచందనం సహా శ్రీవారి ఆస్తుల దోపిడీపై నివేదిక కోరుతాం

తిరుమలలో బండి సంజయ్ కామెంట్స్

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : పుట్టినరోజును పురస్కరించుకొని కేంద్ర మంత్రి బండి సంజయ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. తెలుగు ప్రజలంతా చల్లగా ఉండాలని, ప్రధాని నరేంద్ర మోదీకి ఆశీస్సులు అందించాలని స్వామివా రిని మొక్కుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో కొంతమంది శ్రీవారి ఆస్తులను కొల్ల గొట్టారని ఆరోపించారు. అన్యమతస్తులకు పదవులిచ్చి హిందూధర్మంపై దాడి చేశారని, గత పాలనలో వీరప్పన్ వారసులు  ఎర్రచందనం స్మగ్లింగ్‌తో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని వదిలిపేట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.