కేరళ.. పచ్చని కొండలు, ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. అందుకే చాలా మంది కేరళను చూసేందుకు ఇష్టపడుతుంటారు. మరీ ముఖ్యంగా వింటర్ సీజన్‌లో.. మంచుతో కప్పబడిన పచ్చని కొండలు, పారే జలపాతాలను సందర్శించాలని ఆరాటపడుతుంటారు. అయితే మీకో అవకాశం ఇస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ). వయనాడ్‌లోని పలు ప్రదేశాలను విజిట్ చేసేందుకు ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు సాగుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు కవర్ చేయొచ్చు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐఆర్సీటీసీ “వండర్స్ ఆఫ్ వయనాడ్” పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి రైలు ప్రయాణం ద్వారా ఈ టూర్ సాగుతుంది. వయనాడ్‌లోని పలు ప్రదేశాలను విజిట్ చేయవచ్చు. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. ప్రతి మంగళవారం ఈ ప్రయాణం ఉంటుంది.
టూర్ ఇలా సాగుతుంది..
* మొదటి రోజు ఉదయం 6 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి కాచిగూడ- మంగుళూరు సెంట్రల్ ఎక్స్ (ట్రైన్ నెం 12789) బయలుదేరుతుంది. ఆ రోజు మొత్తం జర్నీ ఉంటుంది.
* రెండో రోజు ఉదయం 6.17 నిమిషాలకు కన్నూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పిక్ చేసుకుని ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సెయింట్ ఏంజెలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియం ను సందర్శిస్తారు. అక్కడి నుంచి వయనాడు జర్నీ స్టార్ట్ అవుతుంది. మధ్యలో కొన్ని పర్యాటక ప్రాంతాలను విజిట్ చేయవచ్చు. ఆ రాత్రి కాల్పెట్టలో హోటల్లో బస చేస్తారు.
* మూడో రోజు ఉదయం హోటల్లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత కుర్యాదీల్లోని పలు ప్రాం తాలను విజిట్ చేస్తారు. తిరువెల్లి ఆలయం, బాణాసూర సాగర్ డాము సందర్శిస్తారు. రాత్రికి కాల్పెట్టలోనే బస చేస్తారు.
* నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత అంబల్వాయల్ హెరిటేజ్ మ్యూజియం, స్కూయిసాలా పాల్స్, ఎడక్కల్ గుహాలు, పొక్కోడి సరస్సును విజిట్ చేస్తారు. ఆ రోజు రాత్రి కాల్పెట్టలోనే బస చేయాలి.
* ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడినుంచి కొజికోడకు చేరుకుంటారు. కప్పడ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం ఎస్‌ఎం స్ట్రీట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. అనంతరం రాత్రికి కాలికట్ రైల్వేస్టేషన్లో డ్రాప్ చేస్తారు. ఆ రాత్రి 11.35కి మంగుళూరు సెంట్రల్ - కాచిగూడ (ట్రైన్ నెం 12790) ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది.
* ఆరో రోజు రాత్రి 11. 40 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ పూర్తవుతుంది.