మనదేశంలో అనేక అద్భుతమైన ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న అజంతా, ఎల్లోరా గుహలు. ఈ పర్యాటక ప్రాంతం భారతదేశంలోనే అరుదైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ గొప్ప విశిష్టత దక్కించుకుంది. ఈ రెండు వేర్వేరు అయినప్పటికీ, అజంతా, ఎల్లోరా గుహలు ఒకే జిల్లాలో ఉన్నాయి.
ఎల్లోరా గుహలు ప్రపంచంలోనే అరుదైన గుహల సముదాయంగా గుర్తింపు పొందింది. అందులో మొత్తం 34 గుహలు, దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ చరణేంద్రి రాతి కొండల్లో చెక్కారు. ఎల్లోరా గుహల సముదాయం రెండు కిలో మీటర్ల కన్నా ఎక్కువ పరిధిలో విస్తరించి ఉంది. దీంతో ఆ ప్రాంతం మొత్తం పక్క పక్కనే నిర్మించిన గుహలతో నిండి ఉంటుంది.
ఇక్కడున్న ఏకశిలా దేవాలయం ప్రపంచంలోనే ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. మరోవైపు ఈ గుహల్లో హిందు, బౌద్ధం, జైనమతాలకు చెందిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రాచీన కాలంలో మనదేశ ప్రజలు ఎలా కలిసిమెలిసి ఉన్నారో తెలియజేస్తాయి.
ఈ ఎల్లోరా గుహలు అన్నింటికన్నా ముఖ్యమైనది పరమేశ్వరుడి కైలాస టెంపు ల్. అది 16వ గుహలో ఉంటుంది. ఒక భారీ బండరాయిని అత్యంత అందమైన దేవాలయంగా తీర్చిదిద్దారు. ఆ దేవాలయంపైనే అనేక శిల్పాలు, డిజైన్లు కూడా రూపొందించారు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాం చింది. మొత్తం 34 గుహలున్న ఈ ఎల్లోరా గుహలు 5 నుంచి 12 శతాబ్దాల కాలంలోనే నిర్మితమైనవి.
అజంతా గుహలు ఔరంగాబాద్‌కు ఉత్తరాన 100 కిమీ దూరంలో ఉన్నాయి. వీటిలో మఠాలు (చైత్యాలు) పూజా మందిరాలు (విహారాలు) ఉన్నాయి. ఇవి పురాతన భారతీయ కళలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.