కె.వి పిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మనువాదులు నిమ్న జాతులకు రక్షణ కల్పించే భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందమని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం.దినకర్, డివైప్ఐ జిల్లా అధ్యక్షుడు గేడం టికానంద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. స్వాత్రంత్రం వచ్చి 76 ఏండ్లు దాటినా నేటికీ రాజ్యంగా ఫలాలు దళిత, గిరిజన, నిమ్న జాతులకు అందలేదన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ శక్తులకు కారు చౌకగా అమ్మేసిందని రిజర్వేషన్ లేకుండా చేసిందని ఆరోపించారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలకు ఉద్యమాలు చేయాలన్నారు. దళితులపైన దాడులు అత్యాచారాలు పెరిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక ఉద్యమాలలో ప్రజలు ప్రజాతంత్రవాదులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విద్యార్థులు కిరణ్, వెంకటేష్, అభి, అంజి, కార్తీక్, రోహిత్, స్వామి తదితరులు పాల్గొన్నారు.