మహబూబ్ నగర్, జనవరి 29 (విజయ క్రాంతి) : వెలకట్టలేని ప్రాణాలను కాపాడటానికి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ఎస్.పి.డి.జానకి తో కలిసి రోడ్డు భద్రత పై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎన్.హెచ్ 44 పై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతాలు పెద్దాయి పల్లి, రాజా పూర్,రంగా రెడ్డి గూడెం,మన్సూర్ ఢాబా, అడ్డాకుల హచరీలు ప్రాంతాల్లో వాహనాల వేగం తగ్గించి ప్రమాదాల నివారణకు లైటింగ్, రంబుల్ స్ట్రిప్ లు ఏర్పాటు చేయాలని,ఫిబ్రవరి 5 లోగా పనులు పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను ఆదేశించారు. ముదిరెడ్డి పల్లి నుండి సెజ్ కు వెళ్ళే సర్వీస్ రోడ్డు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరారు.
కేతేపల్లి వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. బాలా నగర్ అండర్ వెహికిల్ పాస్ వద్ద పనులు జరుగుతున్నందున వా హన దారులకు రోడ్డు డైవర్షన్ తెలిసేలా సెక్యూరిటీ ని రెండు వైపులా, హెచ్చరిక సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.ఎన్.హెచ్ 67 పై వేగ నియంత్రణకు ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్‌లు సైజు తగ్గిన వాటిని పునరుద్ధరించాలని సంబంధిత ఈఈని ఆదేశించారు.
ఫిబ్రవరి 1 నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం,ప్రభుత్వ కార్యాలయాలలో హెల్మెట్ లేకుండా వచ్చే వాహన దారులను అనుమతించడం జరగదని సమావేశం లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశం లో ఎస్పి డి.జానకి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు,డి.ఎస్.పి. వేంకటేశ్వర్లు, అర్ అండ్ బి ఈ ఈ దేశ్యా, ఎస్.హెచ్,మహబూబ్ నగర్ ఈ ఈ రమేష్,డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్,అర్.టి.సి ఆర్.ఎం.సంతోష్ కుమార్,మున్సిపల్ కమిషనర్ రెడ్డి,పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈ ఈ విజయ్ భాస్కర్,సర్కిల్ ఇన్స్పెక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.