calender_icon.png 21 October, 2024 | 10:58 AM

సవారి కచ్రంలో చలో..

21-10-2024 12:00:00 AM

ఆరోజుల్లో ఆచార వ్యవహరాలే కాదు.. రవాణా సదుపాయాలు కూడా తెలంగాణలో చాలా గమ్మత్తుగా ఉండేవి. సామాన్యులు దాదాపుగా నడిచే గమ్యస్థానాలకు చేరుకునేవారైతే.. భూమి ఉన్న రైతు కుటంబాలు మాత్రం సవారి కచడాన్ని (కచ్రం) రవాణా సదుపాయంగా వాడేవారు. పొలంకాడికి పోవాలన్నా.. పొలిమేర దాటాలన్నా.. ఆడబిడ్డను మరో ఊరు నుంచి పండక్కి తీసుకురావాలన్నా సవారి కచడంపై వెళ్లేవారు.

జంట ఎడ్లు గజ్జెల సప్పుడు చేసుకుంటే వెళ్తుంటే.. దర్జాగా ప్రయాణించేవారు. ఎండకు, వానకు తట్టుకునేలా అప్పట్లో మంచి రవాణా సదుపాయంగా ఉపయోగడింది. ఆ తర్వాత ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లు రావడంతో సవారి కచడం కనుమరుగైంది. అయితే ఆ రోజుల్లో మాత్రం సవారి కచడం ఓ బెంజీకారు మాదిరిగా చెలామణీ అయ్యిందంటే అతిశయోక్తి కాదు.