calender_icon.png 22 April, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం

22-04-2025 12:00:00 AM

మంథని, ఏప్రిల్21(విజయ క్రాంతి) *మహాత్మాగాంధీ,  అంబేద్కర్,రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ అన్నారు.  సోమవారం మంథని మండలంలోని వెంకటాపూర్, మల్లారం, అరేంద గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచన మేరకు మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ,  అంబేద్కర్,రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల, ఎస్సీ సెల్  నాయకులు,ఎస్టీ సెల్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.