01-03-2025 12:00:00 AM
ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన
వనపర్తి టౌన్ ఫిబ్రవరి 28 : సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరుతూ జిల్లా కేంద్రం లోని రెయిన్బో పాఠశాల విద్యార్థులు స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగ ణం ముందు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన అందరి చూపులను ఆకట్టుకుంది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసమే వినూత్న రీతిలో చిన్నారులతో నృత్య ప్రదర్శన చేయించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ అనిల్ తెలిపారు.