చాలామందికి షాపింగ్ చేయడం అంటే సరదా, మనకు అవసరమైనవి కొందాం అని షాపింగ్‌కి వెళతాం. తీరా వెళ్లాక ఆఫర్లు చూసి అవసరానికి మించి కొనేస్తాం. తర్వాత బిల్ చూస్తే ఇంత ఖర్చయిందే అని బాధపడతాం. ఇలా కాకుండా మన బడ్జెట్లోనే షాపింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి..
షాపింగ్ వెళ్లాలి అనుకున్న తర్వాత ఆఫర్ల మాయలో పడకుండా మీరేం కొనాలనుకుంటున్నారో ఇంటి దగ్గరే జాబితా రాసుకోవాలి. తర్వాత దాన్ని మళ్లీ గమనించి ఈ వస్తువులు ఎక్కడ తక్కువకి వస్తాయో ఆలోచించండి. పండగల సందర్భంగా కొన్ని సంస్థలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తాయి. తక్కువకి వస్తున్నాయ్ కదాని చూసీచూడకుండా కొంటే మీకే నష్టం.
కాబట్టి మోసపోకుండా, ఏ వస్తువు కొన్నా ఒకటికి రెండుసార్లు, గడువు తేదీలు, నాణ్యతను సరిచూసుకోవాలి, షాపింగ్‌కు జరిపే లావాదేవీలన్నీ కార్డు ద్వారా చేయండి. పండుగల సమయంలో కార్డు ద్వారా తీసుకున్న వాటికి రివార్డు పాయింట్ల ద్వారా గిఫ్ట్ వోచర్లు, క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. దీంతో ఎంతో కొంత ఆదా చేసినట్లు అవుతుంది.