calender_icon.png 14 November, 2024 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యంగా లక్ష్యాలను చేరుకుందాం

11-11-2024 01:10:45 AM

  1. సమావేశంలో మాట్లాడుతున్న సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవి

  2. డెక్కన్ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవి
  3. ఫ్యూచర్ సిటీలో సర్వసభ్య సమావేశం

రంగారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులంతా ఐక్యం గా ముందుకు వెళ్లి లక్ష్యాలను చేరుకోవాలని  దెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ  అధ్యక్షుడు బొల్లోజు రవి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీలోని  మీర్‌ఖాన్‌పేట్‌లో ఆదివారం సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులను కుడా భాగస్వామ్యం చేస్తామని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో అదే ప్రాంతంలో సభ నిర్వహించి తమ మద్దతు తెలియజేశారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బొల్లోజు రవి మాట్లాడుతూ.. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రకటించినందుకు జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. దానికి అనుగుణంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో జర్నలిస్టులు కుడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

అలాగే జర్నలిస్టుల సమస్యలను గుర్తించి ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్రత్యేక చొరవ చూపిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి సభ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో వీలైనంత త్వరగా అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి అయ్యప్ప, డైరెక్టర్లు రామకృష్ణ, కుమార్,  నాగరాజు, జర్నలిస్టులు పాల్గొన్నారు.