ఈ సీజన్‌లో పెదాలు ఎక్కువగా పగిలి ఇబ్బంది కలిగిస్తాయి. ఆ బాధ నుంచి బయటపడాలంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు.
* కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్‌లాగా పని చేస్తుంది. ఇది కొవ్వు ఆమ్లా లను కలిగి ఉంటుంది. ఈ నూనె చర్మా న్ని హైడ్రేట్‌గా, మృదువుగా ఉంచడం లో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను పెదాల కు రాసుకుని పడుకుంటే సరిపోతుంది.
* పెదాలు పగిలిపోతే.. కొద్దిగా వాసెలిన్‌లో తేనె కలిపి పెదాలకు రాసు కుంటే.. మృదువుగా మారతాయి. ఈ మిశ్రమాన్ని పెదవులపై 10 నిమిషాలు అప్లు చేసి, ఆపై మెత్తటి దూదితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోజుకు ఒకసారి చేస్తే అందమైన పెదాలు సొంతమవుతాయి.
* పెదాలు పొడిబారి చికాకు తెప్పిస్తాయి కొందరికి.. అలాంటివారు గ్రీన్ టీ బ్యాగ్స్ ఉపయోగపడతాయి. టీ బ్యాగ్ ను గోరు వెచ్చని నీటిలో వేసి పెదవులపై పూయాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
* పెదాలకు తరచూ మాయిశ్చరైజర్ చేసుకోవాలి. పెట్రోలియం మాయిశ్చరైజర్లు ఈ కాలం వాడకపోవడమే మంచిది. ఇవి స్వేద రంధ్రాలను కప్పి వేడిని పెం చుతాయి. వీటికి బదులుగా తేమ అధికంగా ఉండే బాదం, కొబ్బరి నూనెలు సహజ మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. దురద లాంటివి ఉంటే వైద్యుల సూచనలతో మందులు వాడొచ్చు.
* శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు పెదాలు తడి ఆరిపోయి వాటిపై చర్మం లేచిపోతుంది. దీనిని తీసే ప్రయత్నం చేసినప్పుడు పుండ్లు పడి రక్తస్రావం జరుగుతుంది. శరీరాన్ని నిరంతరం హై డ్రేట్‌గా ఉంచుకోవాలి. కొబ్బరి నీళ్లు, తాజా పండ్లు, నీరు ఎక్కువగా ఉండే కూ రలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
* బొబ్బలతో నొప్పిగా ఉంటే కలబంద గుజ్జు రాయడం వల్ల ఉపశమనం పొందొచ్చు. ఇంట్లో కలబంద మొక్క నుంచి ఆకును కత్తిరించి దాని గుజ్జు తీసి పెదాలకు రాసుకోవచ్చు. లేదంటే కలబంద మిశ్రమంతో చేసిన క్రీమ్‌లను వాడొచ్చు.