calender_icon.png 22 April, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

14-04-2025 12:00:00 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

కడ్తాల్, ఏప్రిల్ 13 : రాజ్యాంగాన్ని మార్చేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపిం చారు. అదివారం కడ్తాల్ మండలం అన్మాస్ పల్లి గ్రామంలో జై బాపు, జై బీమ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే   మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను దేశ వ్యాప్తంగా ప్రజలకు వివరించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్ ,జై సంవిధాన్ నినాదంతో కార్య క్రమం చేపట్టిందన్నారు.బిజెపి పార్టీ మతతత్వన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తోందని  విమర్శించారు.

పదకొండు ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో అంబేద్కర్ రూపొందించిన రా జ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాం గంలోదేశ పౌరులకు కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, ఎస్సీ, ఎస్టీ రిజర్వే షన్లను తొలగించేందుకు బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని విమర్శిం చారు. బి

జెపి పార్టీ విభజన విధానాలను ప్రజలకు వివరించేందుకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టి దేశ వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తున్నామని, మండలంలోని ప్రతి గ్రామంలో మహాత్మ గాంధీ, అంబేద్కర్ చిత్ర పాటలు, భారత రాజ్యాంగాన్ని చేతబూని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్రలు నిర్వహిం చాలని కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా ముదిరాజ్, పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు బీక్యా నాయక్, చేగూరి వెంకటేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్యా నాయక్, నాయకులు హన్మ నాయక్, జగన్, నరేష్ నాయక్, అశోక్, హిర నాయక్, షాబ్బు, రామకృష్ణ, శంకర్ పాల్గొన్నారు.