calender_icon.png 28 October, 2024 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతివృత్తులను కాపాడుకుందాం

28-10-2024 12:34:06 AM

  1. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి 
  2. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ధోబీఘాట్ నిర్మాణ పనులు ప్రారంభం

ముషీరాబాద్, అక్టోబర్ 27 : దేశంలో చేతివృత్తులు కనుమరుగైపోతున్నాయని.. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేంద్ర బొగ్గగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. అలాంటి చేతి వృత్తులను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మయోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

ముషీరాబాద్ నియోజకవ ర్గం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కవాడిగూడలో గల ధోబీఘాట్‌లో రూ.26 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను ఆదివారం ఆయన స్థానిక కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీతో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విశ్వకర్మ యోజన పథకం కింద కేంద్రం చేతివృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, పరికరాలు, ఆర్థికసాయం అందిస్తోందని అన్నారు.

అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గంలో ధోబీఘాట్లు ఏర్పాటు చేస్తున్నా మని అన్నారు. వీలైనంత త్వరగా పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులను కోరారు. అనంతరం ముషీరాబాద్ ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ భవన్‌లో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్ (సౌత్ రీజియన్) కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్కిల్ జీహెచ్‌ఎంసీ డీఎంసీ ఖాదర్, డీఈ సన్ని, వాటర్ వర్క్స్ జీజీఎం కార్త్తీక్ రెడ్డి, మేనేజర్ శ్రీధర్, తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం.నర్సింహ, సంఘం ప్రతినిధులు సి.కొమురయ్య, జె.ముత్యాలు, బి.చంద్రమోహన్, జె.రాజశేఖర్, ఎ.వెంకటేశ్, జి.భాస్కర్, బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.రమేష్ రాం, మాజీ కార్పొరేటర్ టి.రవీందర్, రాష్ట్ర నాయకులు జి.వెంకటేశ్, పరిమల్ కుమార్, సలంద్రి శ్రీనివాస్ యాదవ్, మహేందర్ బాబు, సీకే శంకర్, పూస రాజు, రాజు, దిలీప్ యాదవ్, అనిల్, బీఆర్‌ఎస్ నాయకులు శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

౩౦ కోట్ల మందికి ‘ఉజ్వల’ అందించాం

రానున్న 25 ఏళ్లల్లో భారతదేశాన్ని అభివృద్ధ్ది చెందిన దేశాల సరసన నిలబెట్టాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లోని గాయత్రీ గార్డెన్‌లో ఆదివారం జరి గిన ఎల్‌పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ సమ్మి ట్  2024లో  ఆయన పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యా ప్తంగా 10 కోట్ల మంది పేద మహిళలకు ఉజ్వల పథకంలో భాగంగా ఉచితంగా సిలిండర్ కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది మహిళలు లబ్ధిపొందినట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు కట్టెల పొయ్యి నుం చి విముక్తి కలిగిందన్నారు.

కరోనా సమయంలో 30 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లు అందించిన ఘనత గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్‌దే అని కిషన్‌రెడ్డి అన్నారు.