calender_icon.png 22 February, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

16-02-2025 12:00:00 AM

లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తుంటాం. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. అందుకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ సైలెంట్ కిల్లర్‌లా దాడిచేస్తాయి. అప్రమత్తమయ్యేలోపే శరీరానికి జరగాల్సిన నష్టం జరుగుతుంది. అందుకే లివర్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదంలో కాలేయాన్ని శుద్ధి చేసే ఎన్నో రకాల పద్ధతులున్నాయి. సింపుల్ చిట్కాలతో లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. 

మారుతున్న జీవనశైలి అలవాట్లు, మద్యం, సిగరెట్ వంటి వ్యవనాలు లివర్ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. కాలేయం సంరక్షణకు అవసరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. 

ఉసిరికాయ డీటాక్స్

ఉసిరికాయలో ఉండే ఔషధ గుణాలు లివర్ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడతాయి. ఎంతచెడిపోయిన లివర్ అయినా దాన్ని తిరిగి రిపేర్ చేయగల శక్తి ఉసిరికి ఉంది. లివర్ సెల్స్‌ను హెల్తీగా ఉంచేందుకు ఉసిరిని పొడి రూపంలోకానీ, క్యాండీలు, జ్యూస్ ఇలా ఏ రకంగా అయినా డైట్‌లో భాగం చేసుకునేలా ప్లాన్ చేసుకోండి.

అలోవెరాతో అద్భుతాలు

ఎడారి మొక్కలా కనిపించే అలోవెరాలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక చెంచా అలోవెరా గుజ్జును శుభ్రం చేసి తీసుకోవడం వల్ల లివర్ సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. లేదా జ్యూసుల్లో కలుపుకున్నా సరే. అయితే, మరీ ఎక్కువ తీసుకోవడం వల్ల విరేచనం అవుతుందని గుర్తుంచుకోవాలి.

వీటికి దూరంగా ఉండాలి

మద్యానికి దూరంగా ఉండాలి. అతిగా ఆల్కహాల్ తాగేవారిలో కాలేయం త్వరగా పాడవుతుంది.

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనెలో బాగా వేయించిన పదార్థాలు అతిగా తినొద్దు.

చేపలు, అవిసె గింజలు, పొట్టుతీయని ధాన్యాలు వంటివి డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

చక్కెర ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్, పానీయాలకు దూరంగా ఉండాలి.

 ప్రాసెస్ చేసిన పిండి, ధాన్యాలను అస్సలు తీసుకోవద్దు.

ఈ జాగ్రత్తలు పాటించండి..

రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగండి. ఇది బాడీలోని వ్యర్థాలను తొలగించి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పోషకాలతో కూడిన ఆహారాన్ని డైట్‌లో తీసుకోవడం ఎంతో అవసరం. గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పప్పు ధాన్యాలు, ముల్లంగి, క్యారెట్ వంటివి లివర్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఏదో ఒక రూపంలో వీటిని తీసుకునేలా చూడాలి.

రెగ్యులర్‌గా చేసే ఎక్సర్ సైజులు కూడా లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో పాటు యోగా, ప్రాణాయామం వంటివి అలవర్చుకోవాలి.

మరీ ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేవారిలో లివర్ దెబ్బతింటుంది. దీంతో జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.