calender_icon.png 28 October, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం

28-10-2024 12:14:58 AM

స్వదేశీ మేళా ముగింపు వేడుకల్లో మంత్రి జూపల్లి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): స్థానిక ఉత్పత్తులను వినియోగంతో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపే తం అవడమే కాకుండా.. చిరు వ్యాపారులకు ఉపాధి మెరుగుపడుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈనెల 23న ప్రారంభమైన స్వదేశీ మేళా ముగింపు వేడుకల్లో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భావజాలానికి ఎలాంటి సంబంధం లేకున్నా.. స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంభి భారత్ అభియాన్లు స్వదేశీ ఉత్పత్తుల ప్రాచుర్యం కోసం ప్రత్యేక మేళాను నిర్వహించడం అభినందనీయం అన్నారు.

స్వదేశీ జాగరణ మంచ్ అఖిల భారత సహ సంఘటక్ సతీష్‌జీ మాట్లాడుతూ.. ఇలాంటి మేళాలతో స్థానిక ఉత్పత్తులు మరొక రాష్ట్రంలో పరిచయం అవుతాయని, తద్వారా వ్యాపార విస్తరణ జరుగుతుందన్నారు. దేవేంద్ర ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ తూళ్ల వీరేందర్ గౌడ్, స్వదేశీ జాగరణ మంచ్ క్షేత్ర సంయోజక్ డాక్టర్ లింగమూర్తి, తెలంగాణ ప్రాంత కన్వీనర్ హరీశ్‌బాబు, ప్రచార ప్రముఖ్ కేశవ్ సోని, స్వావలంభి భారత్ అభియాన్ ప్రాంతీయ కన్వీనర్ జీ రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.