ప్రభుత్వ హామీని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాం తి): హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌ను నిత్యం ఆకుపచ్చగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదంటూ కొట్టివేసింది. పబ్లిక్ గార్డెన్‌ను రిక్రియేషనల్ మినహా ఇతర ఏ అవసరాలకు వినియోగించకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ 2009లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిన్‌పై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం తాజా గా తీర్పు వెలువరించింది. ‘నిజాం హయాం లో 40 ఎకరాల్లో పబ్లిక్ గార్డెన్ నిర్మాణం జరిగింది.
లలిత కళాతోరణం, తెలుగు యూనివర్సిటీ లాంటి నిర్మాణాలతో ఇప్పు డు అది సింగిల్ డిజిట్‌కు కుంచించుకుపోయింది. వినోదం కాకుండా ఇతర అవసరాలకు ఈ భూమిని అధికారులు వినియోగిస్తున్నారు. 30,500 చదరపు అడుగు ల్లో (3,389 చదరపు అడుగులు) ప్రొటోకాల్ ఆఫీస్ నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదు’అని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘పబ్లిక్ గార్డెన్‌లో పచ్చదనం పెంచేందుకు చాలా వృక్షాలను పెంచు తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్‌గా గార్డెన్‌ను ఉంచడం కోసం అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
కేవలం ఎలాంటి వినియోగంలో లేదని 859 చదరపు గజాలు మాత్రమే కేటాయిస్తూ ప్రభు త్వం జీవోను మార్పు చేసింది’అని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిష నర్లు మార్పు చేసిన జీవోను సవాల్ చేయలేదని వ్యాఖ్యానించింది. ప్రజావసరాల కోసం ప్రొటోకాల్ పార్కు కట్టాలని నిర్ణయించింది. ఏఏజీ చెప్పిన అంశాల తర్వాత ఈ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదని భావిస్తున్నాం. అయినా, పచ్చదనంతో పార్కు కళకళలాడేలా చూడాలని అధికారులను ఆదేశిసు ్తన్నాం’అని ధర్మాసనం తీర్పు వెల్లడించింది.