calender_icon.png 23 December, 2024 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీతేజ్ కోలుకోవాలని ప్రార్థిద్దాం

23-12-2024 02:41:19 AM

* నేతలు పరస్పర విమర్శలు మానుకోవాలి 

* బాలుడిని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయ క్రాంతి): సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెంద గా, ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిం దే. కాగా, ఆదివారం కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను ప రామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాలు డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం రేవతి కుటుంబసభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆందరూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేశా రు. పరస్పర  రాజకీయ విమర్శలు మానాలని నాయకులకు సూచించారు. బాలుడి చికిత్స పొందుతున్న దృశ్యాలు మీడియాలో చూసి తన మనసు చలించిందని తెలిపారు. 

పగబట్టినట్టు రేవంత్ తీరు..

అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని సంజయ్ ఆరోపించారు. అర్జున్‌కు బాసటగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సినీ ఇండస్ట్రీపై పగబట్టినట్టు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తొక్కిసలాటలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని గుర్తుచేశారు. శ్రీతేజ్ కోలుకోవాలని కో రుకోవడంతోపాటు అందరూ  బాసటగా ని లిచారన్నారు. సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని  మళ్లీ సమస్యను సృష్టించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఐఎం సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందన్నారు.