calender_icon.png 1 April, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యం కోసం అడుగేద్దాం!

23-03-2025 12:00:00 AM

మనం ఫిట్‌గా ఉండటానికి, రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకోవడానికి శరీరానికి తగిన వ్యాయామం తప్పనిసరి. రోజుకు అరగంట చొప్పున.. వారానికి కనీసం ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. వారానికి కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది.

ముఖ్యంగా 60 ఏళ్లుపైబడిన వృద్ధులు రోజుకు అరగంట పాటు వాకింగ్ చేయడం వల్ల గుండెజబ్బుల ముప్పు 40 శాతం, పక్షవాతం ముప్పు 50 శాతం వరకు తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అధ్యయనంలో తేలింది. అందుకే రోజూ కొంత సమయాన్ని నడకకు కేటాయింద్దాం.

ఒకేసారి వేగంగా నడిచేకన్నా ముందు నెమ్మదిగా నడకను ప్రారంభించి, క్రమంగా వేగం పెంచుకోవాలి. ముందుగా ఐదు నిమిషాలు కాళ్లతో చిన్నపాటి వ్యాయామాలు చేసి, తర్వాత నెమ్మదిగా నడక ప్రారంభించాలి. తర్వాత 10 నుంచి 20 నిమిషాలు కాస్త వేగంగా నడిచి ఒకేసారి నడక ఆపడం మంచిదికాదు.

నడిచేటప్పుడు ఆయాసం, గుండెదడ, గుండెనొప్పి, కళ్లు తిరిగినట్టు అనిపిస్తే నెమ్మదిగా ఆగి విశ్రాంతి తీసుకోవాలి. ఇవి పదేపదే కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. 

జాగ్రత్తలు

* మనం నడిచే ప్రాంతం ఎగుడు దిగుడు, గుంతలు లేకుండా చూసుకోవాలి. పార్కుల్లో గడ్డి ఉన్న ప్రాంతం, లేదా మట్టి రోడ్డు ఉంటే బెటర్. ఇంటి ముందు వరండా లేదా డాబా మీద కూడా నడవొచ్చు. 

* వృద్ధులు బయట వాకింగ్‌కు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు గల చీటీని జేబులో పెట్టుకోవడం మంచిది. వీలైనంత వరకు తెలిసిన వారితో వాకింగ్‌కు వెళ్లడం మంచిది.

* బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు డాక్టర్ల సూచన మేరకు వాకింగ్ చేయాలి. 

లాభాలు

* నడకతో ఫిట్‌నెస్ మంచిగా ఉంటుంది. కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. 

* మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరగడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. అధిక రక్తపోటు తగ్గుతుంది. 

* వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కేలరీలు ఖర్చయ్యి బరువు అదుపులో ఉంటుంది.