calender_icon.png 19 November, 2024 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వదేశీ మొక్కలు నాటుదాం

07-11-2024 12:00:00 AM

తెలంగాణలో గత కొన్ని రోజుల క్రితం కోనోకార్పస్ మొక్కలు ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’, ‘హరితహారం’ కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో, రోడ్ల డివైడర్ల మధ్య నాటారు. ఇప్పుడు అవి ఏపుగా, దట్టంగా పెరిగి చూడటానికైతే ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి. కానీ, వాటి దుష్ప్రభావాలు తీవ్రంగా ఉండగలవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ మొక్కలను తొలగించి, వాటి స్థానంలో వేరే మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు.

ప్ర జారోగ్య పరిరక్షణకు ఇది తప్పనిసరి కూడా. స్థానిక అధికారులు తమ కార్యాలయాల్లో ఈ మొక్కలు ఉన్నట్లయితే తక్షణమే తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కోనోకార్పస్ మొక్క అమెరికా, ఫ్లోరిడాలోని మాంగ్రూవ్ జాతికి చెందింది. బండలతో కూడిన ప్రదేశాలలో మామూలు మొక్కలకంటే త్వరగా పెరుగుతూ, హరిత వాతావరణాన్ని అందిస్తాయి. అరబ్, మధ్యప్రాచ్య దేశాలలో ఎడారి దుమ్ము, ఇసుక తుపాన్లతో చెలరేగే ఇసుక రేణువులను అదుపు చేసేందుకు వీటిని పెంచుతారు.

కానీ, మన దేశంలో ఈ మొక్కలు వాతావరణ దుష్ప్రభావాలను కలిగిస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కోనోకార్పస్ మొక్క పండ్లు, పుష్పాలు వాడుకకు పనికిరావు. వీటి కొమ్మలపై కనీసం పక్షులుకూడా గూడు కట్టేందుకు ఇష్టపడవని అంటున్నారు. భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తూ, మానవాళిపై అనేక అనారోగ్య సమస్యలను సృష్టిస్తాయని వారు చెబుతున్నారు. శ్వాస సంబంధ వ్యాధులు, అనేక రకాల ఎలర్జీలు ఎదురవుతాయని అంటున్నారు. భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలను కలిగించే అవకాశం ఉన్నం దున తక్షణ నిర్మూలన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- సింగు లక్ష్మీనారాయణ, కొత్తపల్లి, కరీంనగర్