16-03-2025 12:00:00 AM
పాశ్చాత పోకడలు సరికావు
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
రాజేంద్రనగర్ మార్చి 15 (విజయక్రాంతి): మన ధర్మాన్ని విస్మరించొద్దని, పాశ్చాత పోగుడులు సరికావని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ ఇతిహాస్ సంకలన్ సమితి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ లోని తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్ లో దక్షిణపద త్రూ థ ఏజెస్ - గ్లోరియా ఆఫ్ భారత్ నేషనల్ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం ఐఏఎస్, న్యూఢిల్లీ అభిసి నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాల ముకుంద పాండే, పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, నరసింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేషనల్ సెమినార్ కు చేరుకున్న గవర్నర్ కు భారతీయ ఇతిహాస్ సంకలన్ సమితి సభ్యులు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి మనం గొప్ప పురాతన ధర్మాన్ని విస్మరించి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒకరు బాధ్యతగా భావించి మన ధర్మం గురించిbతెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు భారతదేశ పురాతన ధర్మాన్ని వివరించాలని సూచించారు. మన భారతదేశానికి ఎంతో చరిత్ర ఉందని తెలిపారు.
ఇతర దేశాలలో ప్రజలు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకొని దానిని అనుసరిస్తున్నారని అన్నారు. మనలో కొందరు పాశ్చాత సంస్కృతి మోజులో మునిగిపోతున్నారని పేర్కొన్నారు. మన పూర్వీకులు ఎంతో గొప్ప సంస్కృతి, సంపదను మనకు ఇచ్చారని దానిని కాపాడాల్సిన అవసరం బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు.