04-03-2025 02:05:11 AM
చట్టసభల్లో తీసుకునే విధానపరమైన నిర్ణయాలవి: హైకోర్టు
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతల విషయంలో జోక్యం చేసుకోలేం. అది చట్టసభల్లో తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం’ అని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎలక్షన్ నిబంధనలపై పిల్ దాఖల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.25 వేలు చెల్లించాలని పిటిషనర్ ను ఆదేశించింది.
చెల్లించని పక్షంలో పిటిషనర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు సర్పంచ్/ఎంపీటీసీ / జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబం ధనను సవాల్ చేస్తూ నల్లగొండ జిల్లాకు చెందిన ఆవుల నాగరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. దీనిపై తాత్కాలిక ప్రధాన జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుకా యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. సంతానం విషయంలో ఎన్నో దేశాల్లో నిబంధనలు ఎత్తివేశారని వాదించారు. అనం తరం ధర్మాసనం స్పందిస్తూ.. పిల్ వెనుక ప్రజాప్రయో జనమేమీ లేదని, వ్యక్తిగత ప్రయోజనం మాత్రమే కనిపిస్తున్నదని అభిప్రాయపడిం ది. చట్టపరమైన అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది.