calender_icon.png 3 April, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటు ఊరుకోం

02-04-2025 01:21:20 AM

ఒక్క అంగుళాన్నైనా వదులుకోం!

  1. 400 ఎకరాల భూమిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టొద్దు..
  2. హైదరాబాద్ జీవవైవిధ్యాన్ని దెబ్బతీయొద్దు..
  3. హెచ్‌సీయూ వద్ద విద్యార్థుల నిరసన
  4. మద్దతు తెలిపిన బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీతో
  5. పాటు వామపక్ష నేతల అరెస్ట్ 

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ‘హెచ్‌సీయూ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టొద్దు.. హైదరాబాద్ జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయొద్దు.. మాకు ఒక అంగుళం ఎక్కువ వద్దు.. అలాగని ఒక అంగుళం తక్కువైనా మేం ఒప్పుకోం.. హెచ్‌సీయూ భూముల జోలికి ప్రభుత్వం రావొద్దు.. మేం ఏమా త్రం వెనక్కి తగ్గం.

భూములు కాపాడుకునేందుకు శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులు బనాయించడం దుర్మార్గం. సర్కార్ ఆ కేసులన్నింటినీ ఎత్తివేయాలి..’  అంటూ నినదిం చారు. రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలి పరిధిలోని 400 ఎకరాల భూముల విక్రయ వివాదంపై విద్యార్థి లోకం, విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.

భూములను కాపాడుకునేందుకు వి ద్యార్థులు చేపడుతున్న నిరసన కార్యక్రమా లు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ ) గేట్ ఎదుట మంగళవారమూ విద్యార్థులు నిరసన చేపట్టారు. వారికి మద్దతు పలికేందుకు బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీతో పాటు వామపక్షాలకు చెందిన నేతలు హెచ్‌సీయూకు చేరుకున్నారు.

ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేస్తూ యూనివర్సిటీలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. 50 మం దికిపైగా విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించా రు.

అనంతరం వారిని మాదాపూర్, కొల్లూ రు, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు అ ప్రమత్తమై హెచ్‌సీయూ వద్దకు భారీగా భద్రతా బలగాలను మోహరింపజేశారు.

విద్యార్థులపై కేసులు దుర్మార్గం

 ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థుల డిమాండ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టొద్దని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎల్ మూర్తి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, పీడీఎస్‌యూ (వీ) నేత విజయ్, పీడీఎస్ యూ నాయకుడు నవీన్ డిమాండ్ చేశారు.

భూములను కాపాడుకునేందుకు ఆందోళన చేపట్టిన విద్యార్థులపై కేసులు పెట్టడం దు ర్మార్గమని, వారందరిపై కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైద రాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీ పరిధిలో ని ఆర్ట్స్ కాలేజీ ఎదుట మంగళవారం బీఆర్‌ఎస్వీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్ యూ (వీ), పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.

ఆయా సంఘాల నేతలు ర్యాలీగా తార్నాకా వైపు వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు పలువురు విద్యార్థి నేతలను అరెస్ట్ చేశారు. వారి అరెస్ట్‌లను ఖం డిస్తూ విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మా ట్లాడుతూ.. ఓయూలో నిరసనలు, దీక్షలు చేపట్టవద్దని వర్సిటీ జారీ చేసిన అప్రజాస్వామిక సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవా లని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌కు ఆక్సిజన్‌ను అందిస్తున్న హెచ్‌సీయూ భూముల ను అమ్మాలని చూస్తే, జీవవైవిధ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బుల్డోజర్లను అడ్డుకునేందుకు యత్నించిన విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారని మండిపడ్డారు. విద్యార్థినులను సైతం అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లలో ఉంచి ఇబ్బందులకు గురిచేయడంపై ధ్వజమెత్తారు. శాం తియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై  కేసులు బనాయించడాన్ని సహించబోమని హెచ్చరించారు.  

పలు వర్సిటీల్లో ఆందోళనలు

హెచ్‌సీయూ భూముల విషయంలో సర్కారు అనుసరిస్తున్న తీరుపై ఒక్క హెచ్‌సీ యూ విద్యార్థులే కాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీలకు చెందిన విద్యార్థులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమా లు చేపడతున్నారు. దీనిలో భాగంగా వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో పలు విద్యార్థి సంఘాల నేతలు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా పోలీసులకు విద్యా ర్థి సంఘ నాయకులకు తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. అలాగే మహబూబ్‌నగర్‌లోని పాలమూరు వర్సిటీ, కరీంనగ ర్ శాతవాహన, నల్లగొండ మహాత్మాగాంధీ, నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీల్లో నూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధుల గృహనిర్బంధం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయొద్దని ఉద్యమిస్తున్న  విద్యార్థులకు మద్దతు ఇచ్చేందుకు వర్సిటీకి బయల్దేరబోతున్న పలువురు బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులను మంగళవారం పోలీసు లు గృహ నిర్బంధం చేశారు. ఇప్పటికే ఆ భూములు ఎవరివనే అంశంపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది.

ఈ నేపథ్యంలోనే పోలీసులు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకుని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, సూర్యనారాయణ గుప్తా, పార్టీ రాష్ట్ర నేత కాసాని గణేశ్, బంజారాహిల్స్‌లోని బీజే పీ ఎల్పీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నివాసంలో ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఎమ్మెల్యేలకు మ ధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఎమ్మె ల్యే పాయల్ శంకర్‌తో పాటు పలువురు నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

రాష్ట్రంలో అరాచక పాలన : ఎల్పీ ఎమ్మెల్యే ఏలేటి 

రాష్ట్రంలో నిర్బంధ, అరాచక పాలన సాగుతున్నదని బీజేపీ ఎల్పీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసులను తనను గృహ నిర్బంధం చేయడాన్ని తప్పుపడుతూ ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కోసమే ప్రభుత్వం హెచ్‌సీయూ భూములు విక్రయించేందుకు సిద్ధమైందని ఆరోపించారు.

రూ.40వేల కోట్ల విలువైన భూములను రూ.20 వేల కోట్లకే అమ్మేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పాలన వదిలేసి రియల్ ఎస్టేట్ దందాకు దిగిందని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. హెచ్‌సీ యూ భూముల జోలికి వెళితే బీజేపీ సహించబోదని హెచ్చరించారు. విద్యార్థులతో కలి సి ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు బలి అయితే, అం దుకు ప్రతిఫలంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాద్‌కు హెచ్‌సీయూ ఇచ్చా రని గుర్తుచేశారు. మంత్రులు శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులేనని, వారు వర్సిటీకి ఎలా వెళ్తారని ప్ర శ్నించారు. హెచ్‌సీయూ విషయంలో బీఆర్‌ఎస్ కూడా దొంగ ఏడుపు ఏడుస్తోందని విమర్శించారు. 

కేటీఆర్, హరీశ్‌రావు ఇంటి వద్ద కూడా..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉ దయం హెచ్‌సీయూ వద్దకు వెళ్తారని అంచ నా వేసిన పోలీసులు వారి ఇండ్ల వద్దకు చేరుకున్నారు. వారు ఇంటి నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు.

చీకోటి ప్రవీణ్ మద్దతు

కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణ కో సం ఉద్యమిస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ హె చ్‌సీయూకు చేరుకున్నారు. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రవీణ్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులను దాటి ప్రవీణ్ హెచ్‌సీయూలోకి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు ఆయ న్ను  అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

భూముల విక్రయంపై హైకోర్టులో పిల్ 

  1. నేడు అత్యవసర విచారణ
  2. రాష్ట్రప్రభుత్వానికి షాక్

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూముల విక్రయానికి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. భూముల వేలాన్ని అడ్డుకుని, ఆ భూమిని నేషనల్ పార్క్‌గా ప్రకటించాలని కోరుతూ ‘వట ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

‘పిల్‌పై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యర్థించగా.. వెంటనే ధర్మాసనం స్పందించింది. పిల్‌ను విచారణకు అనుమతించి, బుధవారం అత్యవసర విచారణ చేపడతామని స్ప ష్టం చేసింది. దీంతో ప్రభుత్వానికి షాక్ తగిలినట్లయింది. విచారణ అనంతరం ధర్మాసనం ఎలా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

హెచ్‌సీయూ విద్యార్థులపై లాఠీచార్జ్ దుర్మార్గం

బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్‌వీ సుభాష్

రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూ నివర్సిటీ సమీపంలోని 400 ఎకరాల విలువైన భూములను విక్రయించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి, మీడి యా ఇన్‌చార్జ్ ఎన్‌వీ సుభాష్ తీవ్రం గా ఖండించారు. రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపా రు.

భూములను అమ్మడం ద్వారా ప్రభుత్వానికి అస్తిత్వం ఎలా లభిస్తుందని ప్రశ్నించారు. హెచ్‌సీయూలో భూముల అమ్మకానికి వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణ దిశగా, ప్రజల ప్రయోజనాలను రక్షించే లక్ష్యంతో వి ద్యార్థులు నిరసన తెలిపారని, వారి పై విచక్షణారహితంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటి కైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని లేదంటే ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.