calender_icon.png 28 December, 2024 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి ఉద్యమిద్దాం

03-12-2024 06:05:13 PM

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికై ఈ 7న ఆటో, టాక్సీ,వ్యాన్, క్యాబ్ ల రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ అన్నారు. మంగళవారం రెబ్బెన మండలంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకై, ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే అమలు చేయాలని, ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఇస్తానన్న హామీని నెరవేర్చాలన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని  ఆటో ర్యాలీ నిర్వహించబడుతుంది, అందుకుగాను అన్ని ఆటోలు, ఆటో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలియజేయాలని ఆటో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పాసు సౌకర్యం కల్పించడం వలన ఆటో కార్మికులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, కనుక ప్రభుత్వం తక్షణమే ఆటో డ్రైవర్ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఆటో డ్రైవర్ కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణo మేము వ్యతిరేకం కాదు కానీ ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టడం సరైన పద్ధతి కాదన్నారు.  ఆటో కార్మికులకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ  ద్వారా ఆటోలు ప్రభుత్వమే కొనిచ్చి, 12000 రూపాయలు ఇచ్చి ఆటో కార్ డ్రైవర్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన అన్న, ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటర్ వాహన చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ పథకాల్లో అవకాశం కల్పించాలని కోరారు. 55 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు రూ.6వేలు పెన్షన్ మంజూరు చేయాలన్నారు. ఆక్సిడెంట్, సహజ మరణానికి కూడా రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లందరికీ ప్రభుత్వం యూనిఫామ్ ఉచితంగా ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రెబ్బెన మండలం ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు బి.నరసింగరావు, రాజ గౌడు, వెంకటేశ్వర్ గౌడు, కిషోర్, మహేష్, నారాయణ, జగన్, శ్రవణ్, రవి, శ్యాం, ప్రసాద్, మల్లేష్, మోహన్, చోటు తదితరులు పాల్గొన్నారు.