calender_icon.png 4 January, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ బోర్డును కాపాడుకుందాం కదలిరండి

01-12-2024 10:28:08 PM

మణుగూరు: తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కాపాడుకోవడానికి భవన నిర్మాణ కార్మికులు కదలిరావాలని తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు వేల్పుల మల్లికార్జున్ కార్మికులను కోరారు. ఆదివారం బూర్గంపాడు మండలం సారపాక కపర్తిభవన్లో వీరామల్ల శివ అధ్యక్షతన జరిగిన పట్టణ భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు‌. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు, బడా బహుళ జాతి కార్పోరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి టెండర్ ద్వారా ధారాదత్తం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను కార్మికులు పోరాటాల ద్వారా తిప్పి కొట్టాలని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు వల్లపాక వెంకటేశ్వర్లు, నాయకులు రసూల్, జమీల్, తులసి, రమణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.