09-02-2025 12:49:10 AM
* జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
విజయక్రాంతి క్రీడా ప్రతినిధి : ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, విజయస్ఫూర్తితో సాగాలని జాతీయ బాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. శనివారం కన్హ హార్ట్ ఫుల్ నెస్ బ్యా డ్మింటన్ అకాడమీలో ఓపెన్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ.. క్రీడలతో ఉజ్వల భవి ష్యత్తు ఉంటుందన్నారు.
మూడు రోజుల పాటు సింగిల్స్ డబుల్ టైటిల్ కోసం బాలబాలికలు పోటీ పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అకాడమీ స్పోర్ట్స్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, బ్యాట్ ప్రధాన కార్యదర్శి యువిఎన్ బాబు, బ్యాట్ కోశాధికారి వంశీ, మ్యాచ్ రిఫరీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.