14-04-2025 01:22:13 AM
హన్వాడ ఏప్రిల్ 13 : బీజేపీ రాజ్యాంగం హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని.. జై భీమ్.. జై సంవిధాన్ నినాదంతో ముందుకు వెళ్దామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ అన్నారు. ఆదివారం తిరుమలగిరి, పుల్పోనిపల్లి, ఇబ్రహీంబాద్ గ్రామపంచా యతీలలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన హక్కులు ఉంటాయని తెలిపారు. హక్కులను కాలరాసే హక్కు ఎవరికి ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టంకర కృష్ణయ్య, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, నవనీత, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అవేజ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, తిరుమలగిరి అధ్యక్షుడు మున్నయ్య, ఇబ్రహీంబాద్ అధ్యక్ష, కార్యదర్శు లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితర నేతలు పాల్గొన్నారు.