22-04-2025 01:15:16 AM
రఘునాథపల్లి, ఏప్రిల్ 21 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలని రఘునాథపల్లి మండల బీఆర్‌ఎస్ నాయకుడు గూడ కిరణ్ కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు.
జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలించేందుకు సన్నద్ధం అవుతున్నట్టు తెలిపారు. పార్టీకి గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మండల వ్యాప్తంగా వాల్రైటింగ్తో పాటు పోస్టర్లను పంపించడం, గ్రామాల్లో పార్టీ గద్దెలను నిర్మిస్తున్నట్టు వివరించారు.