calender_icon.png 1 April, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీని మరింత పటిష్ఠం చేద్దాం

31-03-2025 01:05:48 AM

  1. అందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి
  2. హిందువుల ప్రతీ పండుగలో సందేశం ఉంటుంది
  3. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): కొత్త ఏడాదిలో బీజేపీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేద్దామని, అందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరా బాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆ య న పాల్గొన్నారు.

తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే బూత్, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేశామని, త్వరలోనే రాష్ట్ర, జాతీయ కమిటీలు ఏర్పాటు అవుతాయన్నారు. హిందు వుల ప్రతి పండుగలో సందేశంతో పాటు సైన్స్ కూడా దాగిఉంటుందన్నారు.

కులాలకు అతీతంగా సామూహికంగా ప్రజలం దరూ కలిసి ఉండాలనే పండుగలు మనకు సూచిస్తాయనని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోగమించడంతో పాటు ప్రపంచంలో మన దేశ ఖ్యాతి మరింత పెరగాలని ఆకాంక్షించారు.