calender_icon.png 19 April, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రవెల్లి సభను విజయవంతం చేద్దాం

18-04-2025 12:00:00 AM

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పిలుపు

ఇంద్రవెల్లి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఈనెల 20న జరిగే అమరవీరుల సంస్మరణ సభకు రావాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే   వెడ్మ బొజ్జు పటేల్‌కు రగల్ జెండా కమిటీ సభ్యులు కోరారు. ఉట్నూర్ మండల కేం ద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువా రం ఎమ్మెల్యేను కలిసి సభ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమరుల వీరుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆదివాసీలు, మేధావులు, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సభకు ము ఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క రానున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో రగల్ జెండా కమిటీ అధ్యక్షుడు తోడసం నాగోరావు, మాజీ అధ్యక్షుడు కోరెంగ సుంకట రావు, ఆదివాసీ సంఘాలు నాయకులు మెస్రం నాగనాథ్, జుగ్నాక భార త్, దుర్వ ప్రశాంత్ పాల్గొన్నారు.