calender_icon.png 15 January, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవంలో జిల్లాను అగ్రగామి చేద్దాం

12-07-2024 12:29:31 AM

అటవీశాఖ మంత్రి కొండా సురేఖ

హనుమకొండ, జూలై 11 (విజయక్రాంతి): మన మహోత్సవంలో అందరి భాగ్యస్వామ్యంతో విరివిగా మొక్కలు నాటి జిల్లాను అగ్రగామిగా నిలబెడదామని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వనమహోత్సవం వజ్రోత్సవంలో భాగంగా వరంగల్ మహానగరక పాలక సంస్థ, అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నగరంలోని లేబర్ కాలనీ ఈఎస్‌ఐ ఆసుపత్రి ఆవరణలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి,  కలెక్టర్ డాక్టర్ సత్యశారద,  జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే,  జిల్లా అటవీ శాఖ అధికారి అనూజ్ అగర్వాల్ తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. అంతకు ముందు అధికారులతో కలిసి మంత్రి వన మహోత్సవ ప్రతిజ్ఞ చేశారు. కార్పొరేటర్లు  బాబు, సురేష్ జోషి,  రవి, రామతేజస్వి శిరీష్, అదనవు కలెక్టర్‌సంధ్యారాణి, ఆర్డీవో కృష్ణవేణి పాల్గొన్నారు.