calender_icon.png 31 March, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం

28-03-2025 09:18:58 PM

ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పాలమూరు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 46వ వార్డులో ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీసీ రోడ్లు అవసరమైన ప్రాంతాల్లో అద్భుతంగా వేసుకుందామని, ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని సూచించారు. నాయకుడు అధికారులు ప్రజలు ఎవరైనా సమస్యలు ఎక్కడ ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి బెనహార్, తదితరులు ఉన్నారు.