calender_icon.png 7 January, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ స్ముల్‌XIను విజయవంతం చేద్దాం

03-01-2025 12:35:47 AM

రామగుండం, జనవరి2: ప్రతి సంవత్స రం లాగే ఈ సంవత్సరం కూడ జనవరి ఒకటో తారీకు నుండి 31వ తారీకు వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్ముల్ XIను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసి  విజయ వంతం చేయాలని రామగుండం సీపీ  శ్రీనివాస్  వివిధ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులను కోరారు. రామగుండం పోలీ స్ కమిషనరేట్ లో సీపీ అధ్యక్షత గురు వారం వివిధ ప్రభుత్వ శాఖ లతో నిర్వహించిన సమన్వయ సమావేశం నిర్వ హించారు.

ఈ సందర్బంగా సీపీ  మాట్లా డుతూ... ఆపరేషన్ స్ముల్‌XIలో పాలుపంచు కొంటున్న ఒక్క అధికారి ముగ్గురు పిల్లలను రెస్క్యూ  చేయాలనీ కోరారు. క్షణికావేషంలో పిల్లలు తొందరపాటులో చిన్న చిన్న విష యాలకే తల్లి దండ్రులను విడిచి ఇంటికి  దూరంగా ఉంటున్నారని, ఇట్టి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిని ప్రమా దకర పనుల్లో వారితో పనులు చేయిస్తూ వారి జీవితాలతో  ఆడుకుంటున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తప్పి పోయిన పిల్లలను వెతికి ‘దర్పణ్ ‘ అప్లికేషన్ ద్వారా వారిని గుర్తించి తిరిగి తల్లి దండ్రుల వద్దకు చేర్చి వారి శోకాన్ని తీర్చాలన్నారు. బిక్షాటన చేస్తున్న వారి గురించి, బాలకార్మికుల గురించి ఎప్పటి కప్పుడు  సమాచారం ఇవ్వడానికి చైల్డ్ హెల్ప్ లైన్ కు చెందిన 1098,112 నెంబర్ల గురించి ప్రజల్లో విస్తృత  ప్రచారం చేయాలని, ప్రతీ పోలీస్ డివిజన్ స్థాయిలో ఒక సబ్-ఇన్స్పెక్టర్‌తో పాటుగా ఒక మహిళా పోలీస్ అధికారి, నలుగురు సిబ్బం ది, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో నెల రోజుల పాటు ఇదే పనిపై ఇటుక బట్టిలు, వివిధ రకాల పరిశ్రమలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ లు, ట్రాఫిక్ జంక్షన్‌లు, క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబాలకు దూరంగా ఉంటు న్న పిల్లలను గుర్తించాలని, స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లి దండ్రులకు  నచ్చ చెప్పి తిరిగి వారిని పాఠశాల కు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలన్నారు.

ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు ఎ.సి.పి. మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్- రమేష్ బాబు, ఎస్.ఐ- రాజేష్, శైలజ, లచ్చన్న, శరణ్య, సి.డబ్లు.సి ఛెర్మైన్-శ్రీధర్, డీ.ఏంహె.ఓ- అన్నప్రసన్న కుమారి, లేబర్ ఆఫీసర్- హేమలత, సత్యనారాయణ, డి.సి.పి.ఓ- కమలాకర్, ఆనంద్, పి.ఓ- జితేందర్, డి.ఇ.ఓ సెక్టర్ ఆఫీసర్  సత్యనారాయణమూర్తి, లీగల్ ప్రొబేషనరీ ఆఫీసర్- రజీత, చైల్డ్ లైన్- ఉమాదేవి, రమాదేవి, సి.డబ్లు.సి మెంబర్-శ్యామ్ సుందర్, సుమలత, సబ్ డివిజనల్ ఇన్చార్జి, టీం సభ్యులు పాల్గొన్నారు.