ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి
మెదక్, నవంబర్ 14 (విజయక్రాంతి): నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని.. మెదక్‌ను సురక్షిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి సూచించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో.. పోలీసుల అధికారులు, సిబ్బందితో ఆయన నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు పాల్గొన్నారు.