మహబూబ్ నగర్, జనవరి 8 (విజయ క్రాంతి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన జనరల్ హాస్పిటల్ లో ఎన్నో సందేహాలతో వివిధ రోగాలతో ఆస్పత్రికి వేలాదిమంది వస్తుంటారని ఈ ఆస్పత్రిని ఆదర్శంగా తీర్చిదిద్ద వలసిన అవసరం మనందరిపై ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు.
బుధవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శాసన సభ్యులు శ్రీనివాస రెడ్డి, ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్ పర్సన్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. గత సమావేశం లో తీసుకున్న నిర్ణయాలపై చర్యలు,ఆసుపత్రి అభివృద్దికి తీసుకోవలసిన చర్యల పై సమీక్షిం చారు.
ఈ సందర్భంగా ఎంపి డీకే అరుణ మాట్లాడుతూ బోధనా ఆసుపత్రి భవనం త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతి పేదవానికి వైద్యం అందించాలని వచ్చే 4 సంవత్సరంలలో ఉత్తమ ఆసుపత్రిగా రూపొందించేందుకు కార్యాచరణ రూపొందించాలని పేర్కోన్నారు.
అత్యవసర పనుల నిమిత్తం 10 లక్షలు మంజూరు : ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి
ఆసుపత్రి లో సేవలు హైదరాబాద్ కు తగ్గ రీతిలో అందించే విధంగా భవిష్యత్తు లో రాష్ర్టంలో నే ఉత్తమ ఆసుపత్రి గా ఆసుపత్రి అభివృద్ధి చేయుటకు తన వంతు కృషి చేస్తామని, అత్యవసరంగా ఆస్పత్రిలో చేయవలసిన పనుల నిమిత్తం రూ 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎం.పి. డి.కె. అరుణ, శాసన సభ్యులు శ్రీనివాస్ రెడ్డి లు కార్దియాలజీ హబ్‌ను, మాతా శిశు విభాగం (ఎంసిహె) వార్డు ను, ఇఎన్టీ ఆపరేషన్ థియేటర్ తో పాటు ఓటి కాంప్లెక్స్ ను ప్రారంభించారు.
ప్రత్యేక గదులు ఏర్పాటు : కలెక్టర్
ఆసుపత్రి లో స్పెషల్ ఆసుపత్రి లో స్పెషల్ రూం లు రోగులకు అద్దెకు ఇచ్చేందుకు కమిటీ లో నిర్ణయం తీసుకున్నారు .7 సింగిల్ రూంలు, 2 షేరింగ్ రూం లు రోగులకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
సింగిల్ రూం రోజుకు రూ.1000 చొప్పున, షేరింగ్ స్పెషల్ రూం లు రోజుకు రూ 500 చొప్పున రెంట్ నిర్ణయించినట్లు తెలిపారు. వీటితోపాటు పలు భివృద్ధి కార్యక్రమాలను చేసేందుకు కమిటీ పూర్తయిలో చర్యలు తీసుకుంటున్న విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, అధికారులు ఉన్నారు.