- విద్యానిధికి విశేష ఆదరణ లభిస్తుంది
- విద్యానిధికి ముగింపు ఉండదు.. ఎవరు అధికారంలో ఉన్నా విద్య అనేది ఉంటది
- ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారుస్తాం: మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
- మహబూబ్ నగర్ జనవరి 13 (విజయ క్రాంతి) : ప్రభుత్వ పాఠశాలలో పక్క ప్రాం తాల నుంచి కూడా వచ్చి చదువుకునేలా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు మొద టి అడుగు వేశారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి. ఈ అడుగు కుహొ విద్యా నిధి నామకరణం తో వ్యాపార స్తులను, ప్రజా ప్రతినిధులను, దాతలను ఆక ర్షిస్తుంది. ఇందుకు ప్రధాన కారణాలు లేక పోలేదు.
- హొ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పేద విద్యార్థులకు ఏదై నా చేయాలని ప్రతిక్షణం పరితపిస్తూ విద్యా నిధికి శ్రీకారం చుట్టారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కేవలం ప్రభుత్వ పాఠశాల వి ద్యార్థులకు చేయూతను అందించేందుకు విద్యా నిధి అడుగులు వేస్తుంది.
సౌకర్యాలు లేవని బాధ ఉండొద్దు
ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాలన్నీ అందించేందుకు విద్యానిధి ద్వారా మహ బూబ్‌నగర్ నియోజకవర్గంలో మొదటి అడుగు పడింది. డిజిటల్ తరగతుల తోపాటు అవసరమైన మౌలిక సదుపాయా లు కల్పించే దిశగా విద్యానిధి అడుగులు వేస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మహబూబ్ నగర్ నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో అయ్యేలా తీర్చి దిద్దేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటుండ్రు.
సన్మానాలు వద్దు.. సహాయం చేయండి
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీని వాసరెడ్డి ఎన్నిక అయినప్పటి నుంచి విద్యా ర్థులకు ఏదో ఒకటి చేయాలని తపన చేస్తూ నే వచ్చారు. సన్మానాలు, శాలువలు, ఫ్లెక్సీలు వద్దే వద్దంటూ కరాకండిగా ప్రజా ప్రతినిధు లకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఏదైనా చేయాలని తపన ఉన్న ప్రతి ఒక్కరూ నోటు పుస్తకాలను అందించాలని, మీరు ఇచ్చిన పుస్తకాలను ఒక దగ్గర ఉంచి అవసరమైన నోటి పుస్తకాలను నోట్ బుక్ లువిద్యార్థు లకు అందజేస్తారని ఎమ్మెల్యే పేర్కొనడంతో వేలాది నోటి పుస్తకాలు ఎమ్మెల్యే కు అందజే శారు.
పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందించు సమయంలో మరిన్ని సదుపా యాలు కల్పించవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే గుర్తించారు. ఎమ్మెల్యే ఆలోచనల నుంచి పుట్టింది విద్యానిధి ఎవరు ఎమ్మెల్యే గా ఉన్న ప్రభుత్వంలో ఎవరు ఉన్నా పాల మూరులో విద్యానిధి ప్రత్యేకంగా ముందు కు సాగుతుందని ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీనివా స్‌రెడ్డి ప్రకటించిన విషయం విధితమే.
చేయాలనే తపన అందరిలో ఉండాలి..
మన దగ్గర ఉన్నది ఎంతలో కొంతైనా సహాయం చేయాలని తపన ప్రతి ఒక్కరిలో కొంతైనా ఉంటే బాగుంటుంది. పేద విద్యా ర్థులకు మంచి చేయాలనే తపన లో నుంచి పుట్టింది విద్యానిధి. ఇప్పటి వరకు దాతలు అందించిన డబ్బులను జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. మరింత మంది దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశా లలో చదువుతున్న విద్యార్థులకు చేయూత ను అందించేందుకు సహాయం చేయాలని కోరుతున్నాను.